పవన్,జేడీ లక్ష్మీనారాయణ ఒకటి అవ్వబోతున్నర?

Oneindia Telugu 2018-03-23

Views 922

V.V. Lakshminarayana, a well-known IPS officer in the two Telugu states, who is serving as an additional DGP in Maharashtra, is seeking voluntary retirement from services. There are speculations that he might join a political party in Andhra Pradesh


గురువారం స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకే స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.
జగన్ అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసుల దర్యాప్తుతో ఒక్కసారిగా ఆయన వెలుగులోకి వచ్చారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ (జేడీ)గా జగన్ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆయన పేరు మార్మోగిపోయింది.
డిప్యుటేషన్ తర్వాత తిరిగి ఆయన మహారాష్ట్ర వెళ్లిపోయారు. మరోవైపు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా ఉన్నారు. ఏపీ తెలంగాణలో పలు కార్యక్రమాలు చేపట్టారు. యువతకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేస్తూ.. సామాజిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారు.
గురువారం వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన లక్ష్మీనారాయణ ఇప్పుడు మరోసారి వార్తల్లోని వ్యక్తి అయ్యారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజకీయాల్లోకి వచ్చేందుకే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
జనసేనతో కలిసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు లక్ష్మీనారాయణతో బీజేపీ నేతలు కూడా టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనను ఎలాగైనా పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS