Pawan Proposes His Third Front Thought With Left Parties

Oneindia Telugu 2018-03-26

Views 658

On Monday, in a meeting with CPI,CPM leaders Janasena President Pawan Kalyan shared his 'third front' idea. But the both left party leaders are not responded to Pawan proposal

2019లో ఎన్నికల నాటికి దేశంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సాధ్యా సాధ్యాలను పక్కనపెడితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేశారు. కేసీఆర్ ప్రతిపాదనకు,ఆయన ప్రయత్నాలకు మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు 'థర్డ్ ఫ్రంట్'పై సొంత ఆలోచన మొదలుపెట్టారట.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తో అడపాదడపా సీపీఎం, సీపీఐ నేతలు భేటీ అవుతున్నారు.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, హోదాపై పోరు గురించి చర్చించేందుకు సోమవారం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన మనసులోని మాటను బయటపెట్టారని తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా 'థర్డ్ ఫ్రంట్' ఏర్పాటును మనమే ఎందుకు ప్రారంభించకూడదని పవన్ అభిప్రాయపడినట్టు సమాచారం.
దేశంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాయని, ప్రజలంతా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఎదురుచూస్తున్నారని పవన్ వామపక్షాల నేతలతో చెప్పారు. మూడో కూటమి ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ..ఆ దిశగా అడుగులు పడితే.. భావ సారూప్యమున్న పార్టీలను ఏకం చేసే బాధ్యతలను కూడా మీకే ఇస్తానని సీపీఎం, సీపీఐ నేతలతో ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్న వామపక్షాల నేతలు.. పవన్ ప్రతిపాదనకు ఎటువంటి బదులు ఇవ్వలేదని తెలుస్తోంది. 2019లొ పొత్తుల రాజకీయమా?, స్వతంత్రంగా వెళ్లడమా? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేనందునా.. దీనిపై రాష్ట్రానికి చెందిన వామపక్షాల నేతలు పెద్దగా స్పందించే అవకాశం కూడా కనిపించడం లేదు
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం భద్రతను కల్పించింది.ఇటీవల గుంటూరు బహిరంగ సభ నేపథ్యంలో ఆయన డీజీపీకి లేఖ రాశారు. తనకు బహిరంగ సభ అనంతరం కూడా భద్రత కావాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఆయన కోరికను మన్నించింది.
పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు 2+2 భద్రతను కల్పించింది. మొత్తం నలుగురు సెక్యూరిటీ సిబ్బంది.. రెండు షిఫ్టుల్లో ఉంటారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS