Ball Tampering : Chappell Speaks Out About His Tampering

Oneindia Telugu 2018-03-28

Views 217

Trevor Chappell said Australia cricket team skipper Steve Smith will struggle to move past the ongoing ball-tampering row.

ట్రివర్‌ చాపెల్‌... 80 దశకాల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 1981 వరల్డ్‌ కప్‌ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రివర్‌ చాపెల్‌(గ్రెగ్‌ చాపెల్‌ సోదరుడు) అసాధారణ రీతిలో బౌలింగ్‌ చేశాడనే ఆరోపణలను ఎదుర్కొన్నాడు. తద్వారా అతడు తన జీవితంలో ఎంతో విలువైన వాటిని కోల్పోయాడు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? తాజాగా కేప్‌టౌన్‌ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. బాల్ టాంపరింగ్ వివాదం వల్ల ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్ర ఒక్కసారిగా మసకబారింది.
ఈ నేపథ్యంలో బాల్‌ టాంపరింగ్ వివాదంపై ట్రివర్ చాపెల్ డైలీ టెలిగ్రాఫ్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో తాను తప్పు చేశాననే కారణంగా తాను ఎంతో క్షోభ అనుభవించానని చెప్పాడు. 1981 వరల్డ్ కప్ సందర్భంగా చోటు చేసుకున్న వివాదాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
'న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించాలంటే కివీస్‌కు ఆరు పరుగులు అవసరం. అప్పుడు కివీస్‌ టెయిలెండర్‌ బ్రేన్‌ మెఖేన్‌ క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న నా సోదరుడు గ్రెగ్‌ చాపెల్‌ అండర్‌ఆర్మ్‌ బౌలింగ్‌ చేయాల్సిందిగా సూచించాడు. నేను కూడా అది మంచి ఆలోచన అని భావించాను. కానీ అది నా భవిష్యత్తును అంధకారంలో పడేస్తుందని ఊహించలేదు' అని అన్నాడు.
అలా బౌలింగ్ చేయడం తప్పేమీ కాకపోయినప్పటికీ, తాను చేసిన చిన్నపాటి తప్పిదం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ఉన్న ప్రఖ్యాతి మంటగలిసిందని అన్నాడు. ఇప్పటికీ చాలామంది దాని గురించి నన్ను అడుగుతూనే ఉన్నారు. ఈ వివాదం కారణంగా నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది' అని చెప్పాడు.

Share This Video


Download

  
Report form