The situation of Telugu parties in the fight against the center looks most discuss at the national level.There is a possibility that they will raise one question to telugu parties..how to ask to join with them without working together.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏప్రిల్ 2 వ తారీఖు!..కారణం ఆరోజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో అడుగుపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణా సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకేసారి ఎందుకు ఢిల్లీ వెళుతున్నారు...అయితే ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు సిఎంలు చెబుతున్న మాటలు...చేస్తున్న వ్యాఖ్యలను బట్టి వీరిద్దరి అంతిమ లక్ష్యం ఒకటేనని తెలుస్తోంది. అదేమిటంటే...కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి వ్యతిరేక శక్తులను ఏకతాటిమీదకు తీసుకు రావడం..అయితే ఇక్కడే మన తెలుగోళ్లకే ఉండే ప్రత్యేకమైన గుణం ఒకటి బైటపడుతోంది.
ఇద్దరు చంద్రుల హస్తిన ప్రయాణానికి కారణాలు...తెలంగాణా సిఎం కెసిఆర్ ఏమో ప్రస్తుతమున్న కూటమిని...మరో పాత కూటమిని తోసిరాజని ఒక కొత్త కూటమిని..అనగా థర్డ్ ప్రంట్ ను కూడగట్టే పని పెట్టుకోని ఢిల్లీ వెళుతున్నరని టాక్...ఇక ఎపి సిఎం చంద్రబాబేమో ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం...నిన్నటి తమ మిత్రపక్షం ఎన్డియే కూటమిని వ్యతిరేకించే వారందరినీ కూడగట్టడం...ఒకరి టార్గెట్ ప్రజంట్...మరొకరి టార్గెట్ ఫ్యూచర్...సరే అంతిమంగా వీరి ఉమ్మడి శత్రువు కేంద్రంలోని ఎన్డిఏ కూటమిగా చెప్పుకోవచ్చు.
తెలుగోళ్ల లక్షణం అదే అనడానికి తాజా రుజువు మరొకటి ఏంటంటే...ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమే తీసుకుంటే తెలుగోళ్లకు ఉన్న ఈ ప్రత్యేక లక్షణాన్ని తేటతెల్లం చేస్తోంది. ఎపికి స్పెషల్ స్టేటస్ కోసమే ఆంధ్రాలో ప్రధాన రాజకీయ పార్టీలైన టిడిపి, వైసిపి పోరాడుతున్నాయి. వీరిద్దరూ పోరాడుతోంది ఒకే అంశం మీద..ఇప్పుడు ఇద్దరి ఉమ్మడి శత్రువు కేంద్రమే..కానయితే వీళ్లిద్దరూ కలసి మాత్రం పోరాటం చేయరు...అదేమంటే ఇక్కడ కూడా రాజకీయ ప్రయోజనాలే పరమావధి...క్రెడిట్ దక్కితే నాకే దక్కాలి...లేకుంటే ఇంకెవరికీ దక్కకూడదు...ఎదుటిపక్షానికి అసలు దక్కకూడదు...అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి...అయితే అది నా ద్వారా రావాలి...అతని ద్వారా వచ్చేట్లయితే అసలు రాకపోయినా పర్లేదు...ఆ తరువాత రాష్ట్రం ఏమైనా పర్లేదు...ఇదీ మన తెలుగునేతల తీరు...
రాష్ట్ర ప్రయోజనాల విషయం వచ్చినపుడు...కేంద్రపై పోరాటం చేయాల్సివచ్చినపుడు...మిగతా అన్ని రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా పోరాటం చేయడం కద్దు...గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినపుడు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు సంబంధించి బద్ద విరోధులైన అన్నాడిఎంకే, డిఎంకే లు కలసి ఏకతాటిమీద కేంద్రం మెడలు వచ్చిన సందర్భాలు చూశాం...కానీ తెలుగువాళ్లు మాత్రం అంతకు పూర్తి విరుద్దంగా రాష్ట్ర ప్రయోజనాల కన్నా...తమ రాజకీయాల ప్రయోజనాలే పరమావధిగా పావులు కదపడం మన ప్రత్యేక లక్షణంగానే చెప్పుకోకతప్పదు.