Nani Posts His Son's Photo In Social Media

Filmibeat Telugu 2018-03-29

Views 204

Actor Nani Son Arjun turns one day."This little rascal turns one today. Donga naa koduku Junnu gaadu" Nani tweeted.

టాలీవుడ్ స్టార్ హీరో నాని తన ముద్దుల కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు. సోషల్ మీడియాలో తమ కుమారుడి ఫోటో పోస్టు చేయడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా చిట్టి రాస్కెల్‌ ఈ రోజుతో మొదటి వసంతంలో అడుగు పెడుతున్నాడు. వీడే నా దొంగనా కొడుకు. జున్ను గాడు' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు.
2012లో నాని, అంజన ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు 2017 మార్చి 29న బాబుకు జన్మనిచ్చారు. ఈ బుడ్డోడికి అర్జున్ అని పేరు పెట్టారు. అయితే ఇంట్లో ముద్దుగా జున్నుగాడు అని పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం నాని 'కృష్ణార్జున యుద్దం' అనే సినిమాతో నటిస్తున్నాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దీంతో పాటు నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్‌ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అశ్వనీదత్‌ నిర్మాత.
‘బిగ్ బాస్ 2' హెూస్ట్ చేయడాని బెస్ట్ ఆప్షన్‌గా నాని అనే నిర్ణయానికి వచ్చి నిర్వాహకులు అతడిని సంప్రదించడం, పలు చర్చల అనంతరం నాని కూడా చేయడానికి ఓకే చెప్పడం జరిగిపోయిందట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS