Mahesh Babu Announced News About Bharat Ane Nenu

Filmibeat Telugu 2018-04-02

Views 723

Bharat Ane Nenu movie team planning for huge event in LB stadium. Mahesh babu announced this news.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న విడుదలకు సిద్ధం అవుతోంది. శ్రీమంతుడు వంటి బ్లాక్ బాస్టర్ చిత్రం తరువాత మహేష్ బాబు కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఇదే. దీనితో భరత్ అనే నేను చిత్రంపై కనీ వినీ ఎరుగని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఆ మధ్యన భరత్ అనే నేను చిత్ర టీజర్ విడుదల చేసారు. మహేష్ బాబు కిల్లింగ్ లుక్స్ అభిమానులని తెగ ఆకట్టుకున్నాయి. దీనితో చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఉమ్మడి ఏపీ రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. మహేష్ బాబుని కొరటాల ముఖ్యమంత్రిగా పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నాడు. తన క్రేజీ మాస్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేసే కొరటాల ఈ చిత్రాన్ని రసవత్తర పొలిటికల్ డ్రామాగా చూపించబోతున్నాడు.
సాధారణంగా రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రంలో హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండదనే భావన ఉంటుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. ఈమె మహేష్ బాబు పీఏ పాత్రలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. మీరు మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చిత్ర విడుదల సమయం దగ్గర పడుతుండడంతో భరత్ అనే నేను మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఏప్రిల్ 7 న భారీ ఈవెంట్ కు ప్లాన్ చేసారు. భరత్ బహిరంగ సభ పేరుతో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

Share This Video


Download

  
Report form