Sunny Leone about her bad experience at the age of 21. She gets emotional about her memories.
పోర్న్ స్టార్ ముద్రతో శృంగార తార సన్నీలియోన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే సన్నీలియోన్ బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సన్నీలియోన్ తాను పోర్న్ చిత్రాలలో నటిస్తున్న సమయంలో ఎదురైన అవమానాల గురించి వెల్లడించింది. బాలీవుడ్ లో సన్నీలియోన్ అడుగుపెట్టిన మొదట్లో ఆమెకు తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి.
అంతకంటే ఘోరమైన అవమానాలని తన 21 ఏళ్ల వయసులోనే ఎదుర్కొన్నానని సన్నీలియోన్ చెబుతోంది. తన 21 ఏళ్ల వయసు నుంచే జనాలు తనని అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. విపరీతంగా మెయిల్స్ వచ్చేవి అని సన్నీలియోన్ తెలిపింది. తన కుటుంబం సహకారంతో ఎంతో మారానని సన్నీలియోన్ తెలిపింది. తన కుటుంబ సభ్యులు అందించిన సహకారం మరువలేనిది అని సన్నీ తెలిపింది.
తనని, తన సోదరుడిని మా అమ్మా నాన్న కంటికి రెప్పలా కాపాడారని సన్నీలియోన్ తెలిపింది. తన యుక్త వయసులోనే తీవ్రమైన అవమానాలని అధికమించాలంటే ఎంతో మనోనిబ్బరం ఉండాలని సన్నిలియోన్ భావోద్వేగానికి గురై మీడియా ముందు విలపించింది. తన జీవితంలో చోటు చేసుకున్న అనేక అంశాలని తన బయోపిక్ కరణ్ జీత్ కౌర్ ది అన్ టోల్డ్ స్టోరీ చూస్తే అర్థం అవుతుందని వెల్లడించింది. సన్నీలియోన్ బయోపిక్ వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కుతోంది. మధ్యతరగతి సిక్కు కుటుంబానికి చెందిన కరణ్ జీత్ కౌర్ అనే యువతి సన్నీలియోన్ గా పోర్న్ స్టార్ గా ఎలా మారింది అనే విషయాలని ఈ బయోపిక్ లో చూపించబోతున్నారు