హైదరాబాద్: ఇండియన్ ప్రీమియిర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌కు సంబంధించిన ఎన్టీఆర్ నటించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఐపీఎల్ 11వ సీజన్‌కు తెలుగులో ఎన్టీఆర్‌ను స్టార్ మా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సంగతి తెలిసిందే.
స్టార్ మా ఆధ్వర్యంలో తెలుగులో వచ్చిన బిగ్‌బాస్ తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహారించడంతో ఈ షో సక్సెస్ అయింది. దీంతో స్టార్ మా ఎన్టీఆర్ స్టార్‌డమ్‌ను మరోసారి ఉపయోగించుకొని తెలుగు అభిమానులకు ఐపీఎల్‌ను మరింత చేరువయ్యేలా చేసింది.
ఇందులో భాగంగా ఐపీఎల్ 11వ సీజన్‌కు ముందు ఎన్టీఆర్‌తో పలు టీవీ ప్రోమోలు షూట్ చేసి.. లీగ్ ఆరంభానికి ముందు వీటిని విడుదల చేసింది. ఈ టీవీ ప్రోమోలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఎన్టీఆర్‌తో పాటు పలువురు హాస్యనటులు నటించారు.