డబ్బు విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు కారణం

Oneindia Telugu 2018-04-07

Views 14

Police chased the Soumya's mystery in Erragadda. They find out her husband Nagabhushanam friend Prakash is assassinated her

ఎర్రగడ్డలో సంచలనం సృష్టించిన గృహిణి సౌమ్య హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేధించారు.సౌమ్య భర్త నాగభూషణం స్నేహితుడైన ప్రకాష్ ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించారు. డబ్బు విషయంలో తలెత్తిన వివాదమే.. ఘర్షణకు దారి తీసి చివరకు హత్య దాకా వచ్చినట్టు ఒక అంచనాకు వచ్చారు.
ప్రకాష్‌, నాగభూషణం ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. బీటెక్ చేసిన నాగభూషణం ఎల్&టీలో పనిచేస్తుండగా.. డిప్లోమా చదివిన ప్రకాష్ పట్నాలో పనిచేస్తున్నాడు. పట్నా నుంచి తరుచుగా హైదరాబాద్ లోని ప్రకాష్ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఇదే క్రమంలో ఇటీవల మరోసారి ప్రకాష్ ఇంటికి వచ్చాడు.
ఏప్రిల్ 2వ తేదీ రాత్రి ప్రకాష్-నాగభూషణం ఇద్దరూ ఇంట్లోనే మద్యం సేవించారు. భోజనం చేశాక నాగభూషణం విధులకు వెళ్లగా.. ప్రకాష్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో డబ్బు విషయమై సౌమ్య-ప్రకాష్ ల మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది.
ప్రకాష్ డబ్బు అడగడంతో సౌమ్య తిరస్కరించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా.. పెనుగులాటలో ఆమె తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయబోగా.. భయపడిన ప్రకాష్ కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆమె బతికి ఉంటే ప్రమాదమని భావించి.. నూనె పోసి నిప్పంటించి, బయట తలుపుకు గడియపెట్టి పరారయ్యాడు.
ప్రస్తుతానికి పోలీసులు ఈ వివరాలన్నింటిని గోప్యంగా ఉంచారు. శనివారం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాగా, కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రకాష్ ఆమె ఫోన్‌ను ఫ్లష్‌ ట్యాంకులో పడేశాడు. దీంతో విచారణ ఆలస్యమైంది. ఆమె కాల్ డేటా, మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించినట్టు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS