Rajamouli Reaction After Watching Rangasthalam Movie

Filmibeat Telugu 2018-04-07

Views 1.6K

Rajamouli response on Rangasthalam movie. Rajamouli praises Sukumar, RamCharan and Jagapathi Babu

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బిజీగా గడిపిన రాజమౌళి ఎట్టకేలకు రంగస్థలం చిత్రంపై స్పందించాడు. రాంచరణ్ అద్భుత నటన, సుకుమార్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. రాంచరణ్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్న సంగతి తెలిసిందే. 1980 నాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. పల్లెటూరి రాజకీయ నేపథ్యంలోసాగిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.
వారం గడచినా రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. రంగస్థలం చిత్రం టాలీవడ్ అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో బాహుబలి తరువాత రెండవ స్థానంలో నిలిచింది.
రాంచరణ్ తన నటనతో ఆడియన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేసాడు. సుకుమార్ తన దర్శకత్వంతో అదరగొట్టాడు. ఈ రెండు అంశాలే సినిమాని మరో స్థాయికి చేర్చాయి.
రంగస్థలం చిత్రంలో ప్రస్తావించుకోవాల్సిన మంచి అంశాలు చాలా ఉన్నాయని రాజమౌళి అన్నారు. కానీ ముఖ్యంగా కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలని రాజమౌళి అన్నారు. సుకుమార్ పాత్రలని తీర్చిదిద్దిన విధానం అద్భుతం అని రాజమౌళి అన్నారు. ముఖ్యంగా చిట్టిబాబు పాత్రని సుకుమార్ మలచిన విధానం, చిట్టిబాబుగా రాంచరణ్ నటన వర్ణనాతీతంగా ఉన్నాయని రాజమౌళి అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రకు ధీటుగా నిలబడింది జగపతి బాబే అని రాజమౌళి అన్నారు. విలన్ పాత్రలో ఆయన భయంకర నటన అద్భుతం అని అన్నారు. జగపతి బాబు డైలాగ్ డెలివరీ విధానం ఆకట్టుకుందని తెలిపారు.
ఈ సందర్భంగా రాజమౌళి మైత్రి మూవీ మేకర్స్ కి, మరియు రంగస్థలం చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసారు.

Share This Video


Download

  
Report form