IPL 2018: David Warner Wishes 'Good Luck' To SRH Ahead Of RR Clash

Oneindia Telugu 2018-04-09

Views 52

former Hyderabad captain David Warner wished the Hyderabad franchise best for their clash with Ajinkya Rahane-led Rajasthan

డేవిడ్ వార్నర్... 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని ఐపీఎల్ విజేతగా నిలిపిన కెప్టెన్. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడటంతో క్రికెట్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిషేధంతో డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
ఐపీఎల్‌కు దూరమైన వార్నర్ మనసు మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతోనే ఉంది. ఎందుకంటే ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సోమవారం తన మొదటి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్ నగరంలోని ఉప్పల్‌లో ఉన్న రాజీవ్‌ గాంధీ స్టేడియం వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్‌ కోసం సన్‌రైజర్స్ పూర్తిగా సిద్ధమైంది. ఈ సందర్భంగా వార్నర్ మాజీ కెప్టెన్‌గా జట్టుపై తనకు ఉన్న అభిమానాన్ని చాటాడు. హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ వార్నర్ ట్వీట్ చేశాడు. ''గుడ్ లక్ టు మై ఫ్రెండ్స్ సన్‌రైజర్స్.. ఈ రాత్రి మంచిగా ఆడండి'' అంటూ సన్‌రైజర్స్‌కి వార్నర్ తన సందేశాన్ని అందించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS