At the end of a run glut that saw the two protagonists scoring a combined 407 runs in 39.5 overs, Chennai Super Kings stood as a five-wicket winner over Kolkata Knight Riders in an Indian Premier League match at the M A Chidambaram stadium. Let's the get the numbers out of our way quickly.
సొంతగడ్డపై మంగళవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి చెన్నై చేధించింది. శామ్ బిల్లింగ్స్(23 బంతుల్లో 56), వాట్సన్(19 బంతుల్లో 42), రాయుడు(26 బంతుల్లో 39) రాణించడంతో 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
వినయ్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా.. తొలి బంతిని బ్రావో సిక్స్‌గా మలిచాడు. ఇక ఐదో బంతిని రవీంద్ర జడేజా సిక్స్‌గా మలిచి మ్యాచ్‌ని లాంఛనాన్ని ముగించాడు. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 202 పరుగుల చేసింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌ను ఆండ్రీ రసెల్ (36 బంతుల్లో 88 నాటౌట్; 1 ఫోర్, 11 సిక్స్‌లు) అసాధారణ ఆటతో నిలబెట్టాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) తోడుగా విధ్వంసం సృష్టించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జట్టు 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.