Ram Charan's Rangasthalam movie emerged as blockbuster in tollywood. This movie has collected Rs 100 Cr (share) collection and has crossed 150 Crores (Gross). With showers of praises, Ram Charan and team seems to be buoyed. In this happy time film unit has been organising Success meet in Hyderabad Yousufguda police ground. Power Star Pawan Kalyan attending as Chief guest for the Rangasthalam success meet.
రంగస్థలం సినిమా సక్సెస్ వేదిక ఎన్నో భావోద్వేగాలకు సాక్ష్యంగా నిలిచింది. ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రతో అఖండ భారతంలోని ప్రేక్షకులను ఆకట్టుకొన్న రాంచరణ్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఓ దశలో పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. రంగస్థలం సినిమా సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకొన్నది. రాంచరణ్‌తో కలిసి ఉద్వేగంగా మాట్లాడారు. పవన్ చేసిన ప్రసంగం ఇదే..
చరణ్‌ను ఒక సంవత్సర కాలంగా చూస్తున్నాను, గడ్డం పెంచుకుని లుంగీ కట్టుకుని మురికి మురికిగా కనిపించేవాడు. అలా లుంగీ కట్టుకుని చేసే ధైర్యం నాకు లేదు. అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి, సిగ్గు వదిలేయాలి. అవన్నీ నా వల్ల కాదు. కానీ రాంచరణ్ అది సాధ్యం చేసి చూపించాడు.
రాం చరణ్ పల్లెటూరిలో పెరుగలేదు. హైదరాబాద్, చెన్నై లాంటి సిటీల్లో పెరిగాడు. అలాంటి ఇతడికి ఈ పల్లెటూరి వాతావరణం ఎంత తెలిసి ఉంటుందో అనుకునేవాడిని. నాకు తెలిసిన చరణ్ నేలకి చాలా దగ్గర ఉండేవాడు. ఎంత ఎత్తు ఎదిగినా చాలా అణిగిమణిగి ఉండేవాడు. ఈ సినిమాలోని పాత్ర అతడి గుండెలోతుల్లో సహజత్వం ఇది. అలాంటి వ్యక్తి చరణ్. అమేజింగ్ పెర్ఫార్మర్.
రాంచరణ్, సుస్మితకు నేను పెద్దన్నయ్య లాంటోన్నీ. బాబాయ్ కంటే అన్నాయ్యను. నేను ముసుగు తన్ని పడుకుంటే.. ఆరేళ్ల వయసులో హార్స్ రైడింగ్ నేర్చుకొనేందుకు వెళ్లేవాడు. చిన్నతనం నుంచే ఏదో నేర్చుకోవాలనే తపన.
రాంచరణ్ ఒక సంపూర్ణమైన నటుడు. నాకు నిజంగా ఆనందంగా అనిపించింది. మా ఇంట్లో ఉన్న వారు మాత్రమే కాదు బయట నటులైనా బాగా చేస్తే చాలా ఆనందించే వాడిని. అలాంటి రామ్ చరణ్ రంగస్థలంలో పుట్టి పెరిగినట్లు చాలా సహజంగా నటించాడు. రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్‌ను అందరూ పొగుడుతుంటే నాకు చాలా ఆనందమేసింది.
మగధీరుడులో రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్ ఒక ఎత్తయితే.. రంగస్థలం మరో ఎత్తు. రాంచరణ్ ఆర్టిస్టిక్ మెటీరియల్. రంగస్థలం కథలో ఒదిగిపోయి గ్రామీణ యువకుడిగా కనిపించినందుకు చాలా ఆనందం కలిగింది.
రంగస్థలం లాంటి అద్భుతమైన పాత్రలు, సినిమాలు రాంచరణ్‌కు భవిష్యతులో మరిన్ని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు రాంచరణ్ మన దక్షిణ భారతానికే కాకుండా అఖండ భారతానికి అతడి స్థాయి బలంగా వెళుతుందని నమ్ముతున్నాను. అంత సత్తా ఉన్న నటుడు. విదేశాల్లో కూడా రాంచరణ్‌కు మంచి పేరు ఉంది.