In IPL-2018 Dinesh karthik mesmerised with his wicky keeping.Leg spinner piyush chawla made batsman to come out of the crease which finally given a way to apply Dinesh karthik strategy perfectly.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ వికెట్ల వెనుక అద్భుతం చేశాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న దినేశ్ కార్తీక్ మైదానంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఈ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లాతో తొలి ఓవర్ వేయిoచిన కార్తీక్ సత్ఫలితం సాధించాడు.
చావ్లా బ్యాట్స్‌మన్‌ను ఊరించేలా బంతులేయగా క్రీజు వదిలి ముందుకొచ్చి ఆడిన జేసన్ రాయ్‌ని స్టంపింగ్ చేశాడు. మళ్లే క్రీజులో బ్యాట్ పెట్టేలోపే మెరుపు వేగంతో దినేశ్ కార్తీక్ వికెట్లను గీరాటేశాడు. గత మ్యాచ్‌లో చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టును గెలిపించిన జేసన్ రాయ్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం ఢిల్లీని దెబ్బతీసింది. ఓపెనర్ జేసన్ రాయ్ ఔటైన తర్వాత ఢిల్లీ వరుసగా వికెట్లను కోల్పోయింది.
ఇక దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన శ్రేయస్ అయ్యర్ బౌండరీ బాది స్లిప్‌లో ఉన్న నితీష్ రాణాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, ఈడెన్ గార్డెన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 71 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 14.2 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది.