చల్లా రామకృష్ణారెడ్డికి చంద్ర బాబు నాయుడు బుజ్జగింపులు

Oneindia Telugu 2018-04-19

Views 466

Congress leader V Hanumantha Rao has supported Andhra Pradesh CM Chandrababu naidu's fast for special status.

మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కొంత మెత్తబడినట్టుగా కన్పిస్తున్నారు. ఏపీలో సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ ఛైర్మెన్‌ పదవిని చల్లా రామకృష్ణారెడ్డికి కేటాయించే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. కడప రీజీనల్ ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇవ్వడంపై చల్లా రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన త్వరలోనే అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు ప్రకటించారు. ఈ తరుణంలో సీఎంతో చల్లా రామకృష్ణారెడ్డి సమావేశం కావడంతో మెత్తబడినట్టు తెలుస్తోంది.
ఆర్టీసీ కడప రీజీనల్ ఛైర్మెన్ కేటాయించడంపై చల్లా రామకృష్ణారెడ్డి టిడిపి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పదవిని తీసుకోబోనని ప్రకటించారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన తనకు రీజినల్ ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇవ్వడం ఓటమి పాలైన వర్ల రామయ్యకు ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇవ్వడంపై ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ తర్వాత అమరావతి నుండి సీఎం ప్రత్యేక దూతను చల్లా రామకృష్ణారెడ్డి వద్దకు పంపారు. చల్లా రామకృష్ణారెడ్డితో ఆయన చర్చించారు. దీంతో చల్లా రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి టిడిపిని వీడకుండా ఆ పార్టీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. నామినేటేడ్ పదవుల విషయంలో అసంతృప్తితో ఉన్న చల్లా రామకృష్ణారెడ్డిని పార్టీ నాయకత్వం బుజ్జగించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమైన నేతలను దూరం చేసుకొంటే రాజకీయంగా నష్టమనే అభిప్రాయంతో చల్లా విషయంలో టిడిపి నాయకత్వం జాగ్రత్తలు తీసుకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలను మోసం చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు కాదని, కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS