Bharat Ane Nenu movie Twitter review. Bharat Ane Nenu world wide grand release today
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ అనే నేను చిత్రంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి. మహేష్ బాబు నటించిన గత రెండు చిత్రాలు నిరాశపరచడంతో కొరటాల శివ సూపర్ హిట్ కాబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పక్కా బ్లాక్ బాస్టర్ అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేష్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఈ చిత్రంలో కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోల ప్రదర్శన ప్రారంభం అయింది. ట్విట్టర్ లో అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోయేలా ఉంది.
భరత్ అనే నేను చిత్రం మహేష్ అభిమానులు పండగ చేసుకునే విధంగా ఉంది. అభిమానులకు ఇది ఫుల్ మీల్స్ లాంటి చిత్రం.
ఫస్ట్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ పరవాలేదనిపించే విధంగా ఉంది.
భరత్ అనే నేను చిత్రం శ్రీమంతుడుని మించేలా ఉంది. ప్రెస్ మీట్ సన్నివేశాల్లో మహేష్ నటన అదుర్స్.
అసెంబ్లీ సన్నివేశాల్లో మహేష్ బాబు చెబుతున్న డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. సింపుల్ గా, షార్ప్ గా ఉంటూ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
దర్శకుడు కొరటాల శివ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటున్నాడు. మహేష్ బాబు పెర్ఫామెన్స్ చాలా బావుంది.
హెలికాఫ్టర్ సన్నివేశంలో మహేష్ ని చూడాల్సిందే. మహేష్ కెరీర్ లో అదొక బెస్ట్ సీన్.
భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ కూడా అంచనాలని మించేలా ఉంది.