చంద్ర బాబు నాయుడు పై నిప్పులు చెరిగిన రోజా

Oneindia Telugu 2018-04-20

Views 2

Film Actor Krishnam Raju fired at Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu for his hunger strike.YSR Congress Party and Nagari MLA Roja satires on Andhra Pradesh CM Nara Chandrababu Naidu over hunger strike.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.చంద్రబాబుది దీక్ష కాదని, ఉపవాసం అని ఎద్దేవా చేశారు.12 గంటల పాటు తినకుండా ఉంటే ఉపవాసం అంటారన్నారు. నేను పుల్కాలు తింటాను, కూరగాయలు తింటాను అని చంద్రబాబు పలుమార్లు మీడియాతో చెప్పారని, అలా తింటే రోజుకు వందల రూపాయలు కావాలని, ఇప్పుడు దీక్ష పేరుతో ఈ రోజు మీ తిండికి రూ.30 కోట్ల ప్రజా సొమ్మును డ్రా చేసుకుంటారా అని ప్రశ్నించారు. మీ దీక్షకు ప్రజల సొమ్మును ఖర్చు పెడితే ఏమనాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమం అంటూ వేదికపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
దీక్షల వల్ల ఏం వస్తుందని, ర్యాలీల వల్ల ఏం వస్తుందని చంద్రబాబు గతంలో చెప్పారని, కానీ ఇప్పుడు ఆయనే ఎందుకు చేస్తున్నారని రోజా ప్రశ్నించారు. నిరసనలు ఇక్కడ ఎందుకు అని చంద్రబాబు అడిగారని, ఇప్పుడు ఆయన ఢిల్లీలో కాకుండా ఇక్కడ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
హోదాను చంపేసిన చంద్రబాబు ఇప్పుడు దాని కోసమే నిరాహార దీక్ష చేయడం విడ్డూరమని రోజా అన్నారు. రేపు చంద్రబాబు తాను ఇచ్చిన హామీలే అమలు కాలేదని దీక్ష చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
ప్రజల సమస్య తెలుసుకునేందుకు జగన్ రోజు పాదయాత్ర చేస్తున్నారని, కానీ చంద్రబాబు ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారని, ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం దీక్ష చేస్తున్నారని, అలాంటి దీక్షను మీడియా బాగా చూపిస్తోందని, కానీ తమ ఎంపీలు ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేస్తే ఏ మీడియా చూపించలేదని మండిపడ్డారు. చంద్రబాబు చేసేది ధర్మ దీక్ష కాదని, ఉపావాస దీక్ష అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS