Ram Charan to Attend Naa Peru Surya Pre Release Event

Filmibeat Telugu 2018-04-24

Views 191

Ram Charan is chief guest for Allu Arjun movie event. Naa Peru Surya prerelease event will be held in Hyderabad
#Naaperusurya
#Alluarjun
#Ramcharan

టాలీవుడ్ కు ఈ వేసవి బాగా కలసి వచ్చేలా ఉంది. రంగస్థలం బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఈ వేసవి ఘనంగా పార్రంభం అంది. ఇక ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ మహేష్ చిత్రం భరత్ అనే నేను కూడా ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా మండే ఎండల్లో, మే 4 న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్, ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
ఆదివారం రోజు మిలటరీ మాధవరంలో నా పేరు సూర్య ఆడియో వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఆర్మీ మాన్ గా నటిస్తుండడంతో ఆడియో వేడుక ఆ ఊళ్ళో నిర్వహించారు. హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడిగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29 న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది.
మెగా అభిమానులని సంతోషంలో ముంచెత్తే వార్త బయటకు వచ్చింది. చాలా కలం తరువాత స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్ ఒకేవేదికపై కనిపించనున్నారు. రంగస్థలం చిత్రం భారీ విజయం సాధించడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే నా పేరు సూర్య ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతుండడం రాంచరణ్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రాబోతుండడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోతోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. రచయిత వక్కంతం వంశి తొలి సారి ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు.

Share This Video


Download

  
Report form