Mahesh Babu, RamCharan, NTR pic goes viral in social media. These star meet in a private party
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భారత అనే నేను చిత్రం ఘనవిజయం సాధించింది. కళ్ళు చెదిరే వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని తెగ ఆకట్టుకుంటోంది. కొరటాల శివ సందేశాత్మక చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాగా మిక్స్ చేసారు. ఓ వైపు సందేశాన్ని ఇస్తూనే కమర్షియల్ అంశాలతో మహేష్ ఫాన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ అందించారు. దీనితో భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్ లోనే బిగ్గెట్ హిట్ గా దూసుకుపోతోంది. ఈ చిత్ర విజయాన్ని మహేష్ ఎంజాయ్ చేస్తున్నాడు. మహేష్ సంతోషాన్ని ఎన్టీఆర్, రాంచరణ్ రెట్టింపు చేసారు.
భారత అనే నేను చిత్రం విజయం సాధించడంతో ఇటీవల చిత్ర యూనిట్ ప్రవేట్ పార్టీ నిర్వహించింది. ఆ పార్టీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా హాజరయ్యారు. దీనితో మహేష్ సంతోషం రెట్టింపు అయిందని చెప్పొచ్చు.
టాలీవడ్ లో స్టార్ హీరోల మధ్య ఇగోలు ఉంటాయనే మాటలకు ఇక కాలం చెల్లినట్లే. ఎన్టీఆర్, చరణ్, మహేష్ వంటి స్టార్ హీరోలే ఒకరిపై మరొకరు అభిమానం కురిపించుకుంటున్నారు. రంగస్థలం చిత్రం విజయం సాధించడంతో మహేష్, ఎన్టీఆర్ రాంచరణ్ కి అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే.