Tollywood star heros remuneration. Mahesh Babu, Prabhas, Allu Arjun and other heros remuneration details
#Tollywood
#Bharath Ane Nenu
#Heros Remuneration
#Mahesh
#Prabhas
#Allu Arjun
#Ram Charan
#Ravi Teja
టాలీవుడ్ లో ఎక్కువగా స్టార్ వారసుల హవా కొనసాగుతోంది. స్టార్ వారసులుగా అడుగు పెట్టిన వారంతా స్టార్ హీరో హోదా దక్కించుకుంటున్నారు. మార్కెట్ పరంగా టాలీవుడ్ కన్నా కోలీవుడ్ పరిధి ఎక్కువనే వాదన ఉంది. కానీ తమిళ నిర్మాతలు ఎక్కువగా నష్టపోతున్నారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ మధ్య ఉన్న ప్రధాన తేడా గురించి ప్రస్తావన వచ్చింది.టాలీవుడ్ లో 100 కోట్లు వసూళ్లు సాధించే సత్తా ఉన్న హీరో 15 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటారు.కానీ కోలీవుడ్ అదేస్థాయి హీరో 50 కోట్లు పారితోషకం డిమాండ్ చేస్తారు.అందువలనే కోలీవుడ్ నిర్మాతలు ఎక్కువగా నష్టపోతున్నారనే వాదన మొదలైంది.ఈ నేపథ్యంలో ఓ జాతీయ పత్రిక టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్స్ వివరాలు బయటపెట్టింది.
సూపర్ కృష్ణ వారసుడిగా, చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్. మహేష్ బాబుకు రెండు తెలుగు రాష్ట్రలో భారీ ఫాలోయింగ్ ఉంది. సరైన చిత్రం పడలేకాని మహేష్ చిత్రం వసూళ్ళలో రికార్డులు తిరగరాస్తుంది. ప్రస్తుతం భరత్ అనే నేను చిత్రంతో అదే జరుగుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం చిత్రానికి 18 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు.
టెంపర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ మంచి జోరుమీద ఉన్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాడు. ఎన్టీఆర్ కు మాస్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ కూడా రూ 18 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.
జయాపజయాలతో సంబంధం లేని హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చిత్రాలకు వచ్చే ఓపెనింగ్స్ ఇందుకు నిదర్శనం. పవన్ కళ్యాణ్ ప్లాపుల్లో ఉన్న సమయంలో కూడా నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంతో ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యారు. అజ్ఞాతవాసి చిత్రానికి గాను పవన్ కళ్యాణ్ 18 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.