ooja Hegde is an Indian model and actress who appears mainly in Telugu and Hindi Films. At present she doing movies with Prabhas, mahesh babu and ntr. recently she also signed a film with Akshay kumar
నాగ చైతన్య నటించిన ఒక లైలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది పూజా హెగ్డే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం కానప్పటికీ ఈ హీరోయిన్ ముకుందా, డిజే సినిమాల్లో నటించింది. తాజాగా ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ తో శ్రీవాసు దర్శకత్వం వహిస్తోన్న సాక్ష్యం సినిమాలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.
ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్, వంశి పైడిపల్లి సినిమా తో పాటు ప్రభాస్, రాదాకృష్ణ సినిమా అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేస్తోంది. మధ్యకాలంలో ఒకేసారి ముగ్గురు అగ్రహీరోల చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే అని చెప్పవచ్చు.
ఈ హీరోయిన్ గతంలో మొహంజొదారో చిత్రంతో బాలీవుడ్ హృతిక్ రోషన్ తో కలిసి నటించింది కాని ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా ఈ హీరోయిన్ కు మరొక బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. సాజిద్ నడియాద్వాల నిర్మాతగా, సాజిద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, బాబీ డియోల్ హీరోలుగా రూపొందించబడుతున్న హౌస్ ఫుల్ 4 చిత్రంలో పూజ హెగ్డే నటించబోతోందని సమాచారం.
తెలుగులో ముగ్గురు టాప్ హీరోలతో నటించబోతున్న ఈ హీరోయిన్ మరోసారి బాలీవుడ్ సినిమాలో నటించబోతుండడం విశేషం. ఈ హీరోయిన్ ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రభాస్ సినిమా జులై నుండి స్టార్ట్ కాబోతోంది. మహేశ్ బాబు సినిమా వచ్చే నెల నుండి మొదలుకాబోతోంది. వరుస సినిమాలతో బిజీ అయిన ఈ హీరోయిన్ మరిన్ని సినిమాల్లో నటించబోతోందో చూడాలి.
#Pooja Hegde
#Akshay kumar
#Pooja Hegde
#mahesh babu
#ntr