BCCI recommends Dravid and Kohli for Dronacharya,Khel Ratna

Oneindia Telugu 2018-04-26

Views 52

The BCCI has recommended former India captain Rahul Dravid for the prestigious Dronacharya award and once again nominated Virat Kohli for the Rajiv Gandhi Khel Ratna honour. Legendary opener Sunil Gavaskar's name has been recommended for Dhyan Chand Lifetime Achievement Award.
భారత పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ పేరును బీసీసీఐ ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సీవోఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ధ్రువీకరించారు. విరాట్‌ కోహ్లీతో పాటు మాజీ క్రికెటర్‌, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరును ద్రోణాచార్య, మరో మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ను ధ్యాన్‌చంద్‌ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు రాయ్‌ తెలిపారు.
ఖేల్‌రత్న కోసం బీసీసీఐ కోహ్లీ పేరు పంపడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది కూడా ఈ అవార్డు కోసం కోహ్లీ పేరు పంపగా రియో ఒలింపిక్‌ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మలిక్‌, తృటిలో పతకం కోల్పోయిన దీప కర్మాకర్‌కు అందించారు. అందుకే ఈ ఏడాది కోహ్లీ పేరును పంపించాం' అని రాయ్‌ వివరించారు. 29 ఏళ్ల కోహ్లి గత ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. 2013లో అర్జున అవార్డును సొంతం చేసుకున్నాడు.
టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తోన్న కోహ్లీ ఈ మూడు ఫార్మాట్లలోనూ స్థిరంగా రాణిస్తున్నాడు. అంతేకాదు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ చిరస్మరణీయమైన విజయాలు అందిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ మరికొన్ని రికార్డులకు చేరువయ్యాడు.
ఇక ద్రవిడ్ విషయానికొస్తే..
భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు ఈ ఏడాది ప్రపంచ కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు ఆ జట్టు కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్‌ పేరును ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. ఇండియా-ఎ జట్టుకు ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
అలాగే మాజీ క్రికెటర్‌, అర్జున అవార్డు గ్రహీత సునీల్‌ గావస్కర్‌ పేరును బీసీసీఐ ధ్యాన్‌చంద్‌ అవార్డుకు సిఫారసు చేసింది.
బీసీసీఐ ఇప్పటికే శిఖర్ ధావన్, స్మృతి మంధన పేర్లను అర్జున అవార్డుల కోసం ప్రతిపాదించింది. సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో బరిలో దిగుతున్న శిఖర్ ధావన్ మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. 2013లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. గత ఏడాది భారత మహిళల జట్టు వరల్డ్ కప్ ఫైనల్ చేరడంలో 21 ఏళ్ల మంధన కీలక పాత్ర పోషించింది. ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్‌లో ఈ బ్యాట్స్ ఉమన్ నాలుగోస్థానంలో నిలిచింది

#Rahul Dravid
#Dronacharya
#Kohli
#Sunil Gavaskar

Share This Video


Download

  
Report form