Police find out woman suspicious Decease in Guntur Arandalpet on Sunday. According to the sources, woman was in relationship with a guy who is working in local restaurant
అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జి సెంటర్ సమీపంలోని ఓ ఇంట్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు రెండేళ్లుగా ఓ యువకుడితో సహజీవనం చేస్తోందని, ఈ నెల 20న అతను హైదరాబాద్ వెళ్లొచ్చేసరికి ఇంట్లో ఆమె విగతజీవిగా కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిది హత్యా?.. ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పొట్టి శ్రీరాములు నగర్ రెండో లైనుకు చెందిన అఖిల్ తేజ (21)కి రెండేళ్ల క్రితం ఫోన్ చాటింగ్ ద్వారా శ్రీలక్ష్మి అనే యువతి పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో అఖిల్ తేజకు ఆమె మరింత దగ్గరైంది. తర్వాత కొద్దికాలానికే ఇద్దరు కలిసి ఓ ఇంట్లో కాపురం పెట్టారు. ఆరండల్ పేటలోని కోహినూర్ బార్ సమీపంలో ఉన్న ఆ ఇంట్లో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.
ఈ నెల 20న హైదరాబాద్ వెళ్లి శనివారం మధ్యాహ్నమే ఇంటికొచ్చేసరికి శ్రీలక్ష్మి విగతజీవిగా కనిపించినట్టు అఖిల్ తేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు వారు ఉంటున్న గది వద్దకు వెళ్లగా.. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడం గమనించారు పోలీసులు. అదే గదిలో రెండు మజ్జిగ బాటిళ్లు, ఓ కూల్‌డ్రింక్ బాటిల్ కూడా లభించాయి. తలుపు లోపలివైపు గడియపెట్టలేదని గుర్తించారు. మృతురాలు పంజాబీ డ్రస్ ధరించినప్పటికీ 'లో దుస్తులు' లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.