prakash raj sensational Comments On sri reddy

Filmibeat Telugu 2018-05-02

Views 1K

Prakash Raj about Sri Reddy Tollywood controversy. Prakash Raj supports Sri Reddy in controversy.
టాలీవుడ్లో సంచలనం రేపిన శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటం ఇష్యూ అనేక మలుపులు తిరిగి చివరకు ఊహించని పరిణామాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి లేవనెత్తిన కాస్టింగ్ కౌచ్ ఇష్యూను పక్కదారి పట్టించారనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఇష్యూపై తాజాగా ప్రకాష్ రాజ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు. శ్రీరెడ్డికి మద్దతుగా ఆయన స్పందించారు. సమస్యను డైవర్ట్ చేయవద్దని సూచించారు.
శ్రీరెడ్డి ఇష్యూ మీద ప్రకాష్ రాజ్ స్పందిస్తూ... ‘ఒక ఆడది చెబుతుందంటే ఒకసారి వినాలి. నువ్వు ఎవరు మాట్లాడటానికి అనడం సరికాదు. తనకు అన్యాయం జరిగింది అని ఆమె ఏడుస్తుందంటే అది కరెక్టా? కాదా? అని వినండి. కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో లేదా? ఉంది కదా....ఆమె లాంటి వారు ఇలా బయటకు రావడం వల్ల పరిస్థితులు మారే అవకాశం కూడా ఉంది.... అని ప్రకాష్ రాజ్ తెలిపారు.
సినిమాలు మాత్రమే కాదు, అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మగాడు ఉన్న అన్ని చోట్లా ఆడదాని మీద దౌర్జన్యం జరుగుతోంది. దయచేసి ఎవరైనా ఇలాంటి సమస్య చెప్పుకుంటూ ఏడిస్తే వారి క్యారెక్టర్‌ను తప్పుబట్టడం లాంటివి దయచేసి చేయొద్దు... అని ప్రకాష్ రాజ్ అన్నారు.
శ్రీరెడ్డి చెప్పిన దాన్ని బాధ్యతా యుతంగా న్యూస్ ఛానల్స్ లో చూపించినందుకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్ కౌన్సిల్ న్యూస్ ఛానల్స్ ను పూర్తిగా ఇండస్ట్రీకి దూరం చేయాలనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు, దీనిపై మీ స్పందన ఏమిటి అనే ప్రశ్నకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.... ఇది సరైంది కాదు అని బదులిచ్చారు.
#PrakashRaj
#SriReddy
#Tollywood

Share This Video


Download

  
Report form