Heavy rains in Various places in Hyderabad on Thursday evening. Climate changed.
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత కురిసింది. మధ్యాహ్నం అప్పటి దాకా ఎండ కనిపించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలు దాటిన తర్వాత హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. హైదరాబాదులో ఒకింత చీకట్లు కమ్ముకున్నాయి. వర్షం కురిసింది.
రెండు రోజుల క్రితం విశాఖపట్నం, అమరావతిలోను ఇలాగే ఒక్కసారిగా వాతావరణం మారిన విషయం తెలిసిందే. విశాఖలో సముద్రం ఎరుపెక్కగా, అమరావతి, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో హఠాత్తుగా సాయంత్రం నాలుగు గంటలకే చిమ్మని చీకట్లు కమ్ముకున్నాయి. హైదరాబాదులోని ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితే కనిపించింది.కాలనీ లు ,రోడ్లు నీటి మాయం అయ్యాయి .అకాల వర్షాలకి ధాన్యం మొత్తం నీల పాలైంది.చెట్లు వేళ్ళతో సహా కిందకు పడిపోయాయి.ghmc రోడ్లను క్లెన్ చేస్తున్నారు .6 మంది గాలి వానలకు మృతి చెందినట్లు తెలుస్తోంది.
#Hyderabad
#Climate