రోజా పై శ్రీ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Oneindia Telugu 2018-05-07

Views 680

SriReddy sensational FB post on Tollywood top producers. Specially mentioned about Mahesh Family.Sri Reddy controversial comments on Roja. Sri Reddy takes u turn over Mahesh Babu movie
#SriReddy
#Tollywood
#MaheshBabu

కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి పోరాటం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఆమె పోరాటం ప్రస్తుతం వ్యక్తులని టార్గెట్ చేస్తూ పక్కదోవ పడుతుందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది. ఇలాంటి విషయాల్లో చట్టబద్దమైన న్యాయపోరాటం చేయాలని పవన్ శ్రీరెడ్డికి సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారందరిని శ్రీరెడ్డి టార్గెట్ చేస్తోందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి.
గత కొంత కాలంగా మీడియాలో జరుగుతున్న వ్యవహారాలు తాను గమనిస్తూనే ఉన్నానని రోజా ఇటీవల ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. కొన్ని రోజులు అయ్యాక సైలెంట్ అవుతారని భావించా. కానీ పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించే విధంగా ప్రోత్సాహించడాన్ని తట్టుకోలేకపోయానని రోజా అన్నారు. ఇండస్ట్రీ మీద కావాలనే బురద చాల్లే ఘటనలు జరుగుతుంటే తాను మాట్లాడానని అన్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్ళు గడిచిందని రోజా అన్నారు.
రోజా వ్యాఖ్యలకు శ్రీరెడ్డి తాజగా కౌంటర్ ఇచ్చింది. రోజా గారి కవరింగ్ బాగానే ఉంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదా.. వాయమ్మా అంటూ కామెంట్ పెట్టింది.
రోజా ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్ళు అయ్యిందట. అయినా కూడా ఆమెని ఎవరూ ఇంత వరకు కెలకలేదట. మీరు ఎవరికీ నచ్చలేదేమో కొంపదీసి ? అంటూ రోజాపై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీ మీద బురద వేస్తున్నానా.. మొత్తం ఇండస్ట్రీ రిపోర్ట్ రెడీ అవుతోంది.. నా వద్దమ్మా నీ లొల్లి అంటూ తన ఫేస్ బుక్ పేజీలో శ్రీరెడ్డి కామెంట్స్ పెట్టింది.
తాజగా మళ్ళీ శ్రీరెడ్డి యుటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మహేష్ బాబుని ప్రశంసలతో ముంచెత్తింది.
సమాజానికి మంచి సందేశాలు ఇచ్చే చిత్రాలు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మహేష్ బాబు గ్రేట్ పర్సన్ అని శ్రీరెడ్డి ప్రశంసించింది. మహేష్ అభిమానులు కూడా సూపర్ కూల్ అని కామెంట్ పెట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS