హాట్ టాపిక్ గా మారిన అద్నాన్ సమీ ట్వీట్స్

Oneindia Telugu 2018-05-08

Views 80

Singer Adnan Sami, who recently visited Kuwait for a performance, has alleged that his staff was mistreated in the country and was called "Indian Dogs". He took to Twitter to talk about his ordeal and complaint about the same to external affairs minister Sushma Swaraj.
ప్రముఖ సింగర్ అద్నన్ సమీ తన అఫీషియల్ ఖాతాలో చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల తన బృందంతో కలిసి ప్రదర్శన ఇవ్వడానికి కువైట్ వెళ్లిన ఆయన అక్కడ తన టీం ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను వెల్లడిస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దీనిపై స్పందించాలని, భారతీయులకు జరిగిన అవమానంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అద్నన్ సమీ చేసిన ట్వీట్ మీద సుష్మా స్వరాజ్ కూడా స్పందించడం విశేషం.
కువైట్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తన బృందం పట్ల పట్ల దారుణంగా ప్రవర్తించారని, ‘భారతీయ కుక్కలు' అని తమను దూషించారని ట్విట్టర్ ద్వారా అద్నన్ సమీ వెల్లడించారు.
ఎంతో ప్రేమతో మీ నగరానికి వచ్చాం. కానీ మీరు మాకు ఎలాంటి సపోర్టు ఇవ్వకపోగా.... ఎలాంటి కారణం లేకుండా తమ పట్ల నీచంగా ప్రవర్తించారు. మా వాళ్లపై భారతీయ కుక్కలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మేము ఊరికే వదిలిపెట్టబోము అంటూ కువైట్‌లోని భారత దౌత్య కార్యాలయానికి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు.
#SushmaSwaraj
#AdnanSami
#Kuwait
#IndianDogs

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS