UMPIRE Bruce Oxenford has confused cricket fans by wearing a strange-looking device on his arm - and here is what it is.
2014వ సంవత్సరంలో ఇజ్రాయేలులో జరిగిన మ్యాచ్‌లో బంతి తలకు తగలి ఓ అంపైర్ మరణించాడు. బౌలర్లకు, బ్యాట్స్‌మన్‌కు రక్షణ కోసం గ్లౌజులు, ప్యాడ్‌లు, హెల్మెట్‌లు, చాతి నుంచి మొదలుకొని.. మోచేతులతో సహా ప్రత్యేక సౌకర్యాలతో ప్యాడ్‌లు ఉండనే ఉంటాయి. మరి అదే సౌకర్యం అంపైర్లకో.. ఈ విషయానికొస్తే, క్రీజులో బ్యాట్స్‌మన్‌కు ఎదురుగా నిల్చొని మ్యాచ్‌ను జడ్జ్ చేయడం అంపైర్ విధి. దీంతో ఇప్పుడు రక్షణలోనూ వాళ్లకు ధీటుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంపైర్లు.
ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాచ్‌లను గమనించినట్లైతే ఎడమచేతికి ఫైబర్ ప్లాస్టిక్‌తో చేసిన ఒక పరికరాన్ని ఓ అంపైర్ ధరించడం చూసే ఉంటారు. మోచేతి నుంచి మణికట్టు వరకు నిటారుగా ఉండి ఆ తర్వాత సర్కిల్ ఉండే ఈ పరికరాన్ని ఆస్ట్రేలియాకు చెందిన అంపైర్ బ్రూస్ అక్సెన్ ఫోర్డ్ తన రక్షణ కోసం తయారుచేసుకున్నాడు.
ఓ లాలిపప్‌ను పోలి ఉండే పరికరాన్ని అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ తన ఎడమచేతికి సరిపోయే విధంగా తయారుచేసుకున్నాడు. అతను దీన్ని 2015 ఐపీఎల్ నుంచి వాడుతున్నాడు. ఆ ప్యాడ్ ఆరు మిల్లీ మీటర్ల మందంతో పాలి కార్డొనేట్ పదార్థంతో తయారుచేయబడింది.
ఒకవేళ బంతి అతని షీల్డ్‌కు తగిలి ఎవరైనా క్యాచ్ అందుకుంటే దాన్ని కూడా అవుట్‌గానే పరిగణిస్తారట. అంతేకాదు, అంతర్జాతీయ మ్యాచ్ లలో సైతం మొట్టమొదటి సారి హెల్మెట్ వాడింది కూడా బ్రూస్ కావడం విశేషం.