Tim Paine Replaces Steve Smith

Oneindia Telugu 2018-05-08

Views 129

Wicketkeeper Paine replaces Steve Smith - who was banned by Cricket Australia for a year following the ball-tampering scandal - for the five-match series.
#Australia
#Tim Paine
#England

బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో అతలాకుతలం అయిపోయిన ఆస్ట్రేలియా జట్టు నిదానంగా కుదరుకుంటోంది. ఈ క్రమంలో ఏడాది పాటు నిషేదానికి గురైన స్మిత్ అందుబాటులో లేకపోవడంతో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. టాంపరింగ్ వివాదానంతరం జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన టిమ్ ఫైన్‌నే జట్టు కెప్టెన్‌గా నిర్దేశించింది. త్వరలో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పర్యటన చేయనుంది. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 జట్లకు కెప్టెన్లను, ఆటగాళ్లను తీసుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ జాతీయ సెలక్టరు ట్రెవర్ హాన్స్ ప్రకటించారు.
జూన్‌లో ఆసీస్‌..ఐదు వన్డేలు‌, ఒక టీ20 మ్యాచ్‌ కోసమని ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఈ పర్యటనలో వన్డే సిరీస్‌కు ఆసీస్‌ కెప్టెన్‌గా టిమ్‌ పైన్‌ను ఎంపికచేసినట్లు ఆస్ట్రేలియా కొత్త కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మంగళవారం పేర్కొన్నారు.
టిమ్‌ పైన్‌.. బాల్‌ టాంపరింగ్ ఉదంతం అనంతరం దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం విదితమే. దీంతో ఇంగ్లాండ్‌తో వన్డే జట్టుకు కెప్టెన్‌గా పైన్‌ను, వైస్‌ కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా సెలక్టర్స్‌ ఛైర్మన్‌ తెలిపారు.
2019 వరల్డ్‌కప్‌ ఇంగ్లాండ్‌లోనే జరుగుతున్నందున ప్రస్తుత పర్యటన ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎంతగానో తోడ్పాటునిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఏకైక టీ20 మ్యాచ్‌కు కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌ నాయకత్వం వహిస్తారని తెలిపారు. ఈ పర్యటనకు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండరు. 2016లో ఆస్ట్రేలియా తరపున ఆడిన నాథన్ లియోన్ జట్టులో భాగం కానున్నాడు.

Share This Video


Download

  
Report form