IPL 2018: RR to Wear Pink Jersey to Spread Cancer Awareness

Oneindia Telugu 2018-05-10

Views 29

Rajasthan Royals will wear pink jersey in their next fixture against Chennai Super Kings scheduled to take place in Jaipur. ... This is the reverse fixture where RR will lock horns with Chennai Super Kings in Chennai.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త జెర్సీలో బరిలోకి దిగనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పింక్ జెర్సీలో ఈ మ్యాచ్ ఆడనుంది.
ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త జెర్సీని బుధవారం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో రహానేతో పాటు జట్టు సభ్యులు హెన్రిచ్ క్లాసెన్, గౌతమ్ కృష్ణప్ప, మహిపాల్ లొమ్రోర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రహానే మాట్లాడుతూ 'ఒక ఆటగాడిగా ఈ పని చాలా చిన్నదిగా నాకు అనిపిస్తుంది. కానీ క్యాన్సర్ రహిత సమాజం కోసం మేం చేసే ఈ పని చాలా కీలకమైనది. రాబోయే మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రజల్లో క్యాన్సర్‌పై పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలి అని భావిస్తున్నా' అని అన్నాడు.
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాయల్స్ జట్టు మూడు రంగులతో కూడిన ఈ ప్రత్యేకమైన జెర్సీని రూపొందించింది. ఇందులో పింక్ రంగు బ్రెస్ట్ క్యాన్సర్‌‌ని, బర్గండి రంగు ఓరల్ క్యాన్సర్‌ని, టీల్ రంగు సెర్వికల్ క్యాన్సర్‌ని ప్రతిబింబిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS