Ram Charan Interview : Ram Charan Talks About Chiranjeevi

Filmibeat Telugu 2018-05-11

Views 9

In Rajeev Masand Interview Telugu star Ram Charan talks about the success of his latest film Rangasthalam and how it’s liberated him to make the movies he believes in, his father - the legendary superstar Chiranjeevi - and what he’s learnt about career longevity from him, and that film he’s making with SS Rajamouli that also stars Jr NTR
#RamCharan
#Rangasthalam

'రంగస్థలం' సినిమా భారీ విజయం సాధించడం, రూ. 200 కోట్ల మార్కును సైతం అందుకోవడంతో బాలీవుడ్ క్రిటిక్స్ దృష్టి కూడా ఇటువైపు మళ్లింది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు రాజీవ్ మసంద్ చెర్రీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. రంగస్థలం సినిమా విశేషాలతో పాటు చరణ్ నెక్ట్స్ చేయబోయే రాజమౌళి మూవీ విషయాలు, చెర్రీ వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల టాలీవుడ్లో సెన్సేషన్ అయిన శ్రీరెడ్డి ఇష్యూను కూడా రాజీవ్ మసంద్ ప్రస్తావించారు. ఆయన అడిగిన ప్రశ్నలుక రామ్ చరణ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
సినిమా రంగంలోకి, నటన వైపు రావడానికి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా ఓ కారణం. నా చిన్నతనంలో నాన్నగారు తన కోసం వచ్చిన అభిమానులకు బాల్కనీ నుండి హాయ్ చెప్పేవారు. అలాంటివి చూసీ చూసి నేను కూడా నాన్న లాగా సినిమాలు చేయాలి అని అనుకునేవాడిని. నేను యాక్టర్ కాకపోయి ఉంటే ఇక్కడ ఆకతాయిగా తిరిగే వాడిని అని రామ్ చరణ్ తెలిపారు.
ఇన్నేళ్ల కాలంలో నాన్న గురించి నేను నేర్చుకుంది క్రమశిక్షణ మాత్రమే. నాన్నగారితో సినిమాల గురించి చర్చించడం తక్కువే. ఆయన ఎప్పుడూ నేను డిసిప్లిన్ గా ఉంటున్నానా? ఉదయం ఎన్ని గంటలకులేస్తున్నాను? రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటున్నాను అని గమనిస్తూ ఉంటారు. రాత్రి 9.30 పడుకోవాలని చెబుతుంటారు. ఇటీవల ఆయన విహార యాత్రకు వెళ్లిన సమయంలో సెండాఫ్ ఇవ్వడానికి వెళితే కూడా సమయానికి పడుకో అని చెప్పి వెళ్లారు... అని రామ్ చరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS