Chiranjeevi's Sye Raa Narasimha Reddy Movie Release Date Locked

Filmibeat Telugu 2018-05-14

Views 966

After blockbuster movie Khaidi No 150,Chiranjeevi coming with Sye Raa Narsimha Reddy. This shooting going at brisk phase. Reports suggest that Actually this movie release date fixed Sankranti festival. But now Ram Charan is planning to release movie on May 9th of 2019

ఖైదీ నంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ల సునామీనే సృష్టించారు. మరోసారి బాక్సాఫీస్‌ వద్ద అలజడి సృష్టించడానికి సైరా నర్సింహరెడ్డితో సిద్ధమవుతున్నది. తొలుత ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు వార్తలు వినవచ్చాయి.
టాలీవుడ్‌లో ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవికి మే 9వ తేదీకి ఓ అవినాభావ సంబంధం ఉంది. ఆ తేదీన ఓ సెంటిమెంటిగా భావిస్తారు. అదే రోజున చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ చిత్రం రిలీజైంది. ఆ రెండు చిత్రాలు చిరంజీవి కెరీర్‌లో ఆణిముత్తాలుగా నిలిచాయి ఇటీవల మహానటి కూడా అదే రోజు విడుదలై ఘన విజయం సాధించింది.
టాలీవుడ్‌లో సాధారణంగా వేసవి సెలవుల్లో భారీ బడ్జెట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. సమ్మర్‌లో వచ్చిన చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. గతేడాది వచ్చి బాహుబలి, ఈ ఏడాది రిలీజైన రంగస్థల, భరత్ అనే నేను చిత్రాలు అనూహ్య విజయాలు సాధించాయి.
వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని సైరా నర్సింహరెడ్డి చిత్రాన్ని వచ్చే ఏడాది మే 9న రిలీజ్ చేయాలని నిర్మాత రాంచరణ్ ఫిక్సయ్యాడట. సైరా చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కొణిదెల బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, సైరా చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే షూటింగ్‌లో తమన్నా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో తమన్నా ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో అమితాబ్, నయనతార తదితరులు నటిస్తున్నారు.

Share This Video


Download

  
Report form