Ball-Tamperer Bancroft Cleared To Play Club Cricket

Oneindia Telugu 2018-05-15

Views 56

Cameron Bancroft has been cleared to play club cricket in Western Australia while serving his ban for ball-tampering in South Africa, as he looks for redemption over a scandal that tarnished his name.
#Australia
#Cricket
#Bancroft

బాల్ టాంపరింగ్‌‌కు పాల్పడి దొరికిపోవడంతో పట్టుబడి తొమ్మిది నెలల నిషేధానికి గురైయ్యారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వార్నర్, స్మిత్, బాన్‌క్రాఫ్ట్. దీంతో వాళ్లపై నిషేదం కూడా జారీ అయింది. అయితే ఇప్పుడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌కు మాత్రం కొద్దిగా ఉపశమనం లభించింది. మళ్లీ క్రీజులోకి రానున్నాడు.. వెస్టరన్ ఆస్ట్రేలియాలోని క్లబ్ క్రికెట్‌లోకి అడుగుపెట్టడానికి బాన్‌క్రాఫ్ట్‌కు అవకాశం దక్కింది. డబ్ల్యూఏ ప్రీమియర్ క్రికెట్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తూ 16 వెస్టరన్ ఆస్ట్రేలియా ప్రీమియర్ క్రికెట్ క్లబ్‌లు సోమవారం సమవేశంలో నిర్ణయాన్ని ప్రకటించాయి.
అంతకుముందు బాన్‌క్రాఫ్ట్‌కు అవకాశం ఇవ్వడంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో 14 క్లబ్‌లు బాన్‌క్రాఫ్ట్ వైపు మొగ్గు చూపగా, రెండు మాత్రమే అతనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. మెజారిటీ క్లబ్‌లు అంగీకరించడంతో ప్రీమియర్ క్రికెట్‌లో ఆడేందుకు బాన్‌క్రాఫ్ట్‌కు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో విల్లెటన్ క్లబ్ తరఫున బాన్‌క్రాఫ్ట్ బరిలోకి దిగనున్నాడు.
వెస్టరన్ ఆస్ట్రేలియా ప్రీమియర్ క్రికెట్ నిబంధనల ప్రకారం, క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధించిన ఏ ఆటగాడైనా రాష్ట్రంలోని క్లబ్ స్థాయి క్రికెట్‌లో కూడా పాల్గొనడానికి వీల్లేదు. అంటే దీన్ని బట్టి డిసెంబర్ వరకు బాన్‌క్రాఫ్ట్ క్లబ్ స్థాయి క్రికెట్ కూడా ఆడలేడు. అయితే నిబంధనలను పక్కన పెట్టిన వెస్టరన్ ఆస్ట్రేలియా డిస్ట్రిక్ క్రికెట్ కౌన్సిల్ (WACA) వినూత్న నిర్ణయం తీసుకుంది. మెజారిటీ క్లబ్‌లు అనుమతిస్తే బాన్‌క్రాఫ్ట్‌ను ఆడించాలని తీర్మానించింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ఓటింగ్‌లో 14 క్లబ్‌లు బాన్‌క్రాఫ్ట్‌ను అనుకూలంగా ఓటేశాయి. దీంతో బాన్‌క్రాఫ్ట్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు.
బాన్‌క్రాఫ్ట్ నిషేధం ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉంది. ఇక స్టీవ్ స్మిత్, వార్నర్‌త నిషేధం మార్చికి ముగిస్తుంది. కాబట్టి అప్పటి వరకు వీరు ముగ్గురూ క్లబ్ క్రికెట్ ఆడుకోవచ్చు. నిషేధం ముగిసిన తరవాత బాన్‌క్రాఫ్.. వెస్టరన్ ఆస్ట్రేలియా, పెర్త్ స్కాచర్స్ జట్లకు ఆడుకోవచ్చు. అలాగే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ న్యూ సౌత్ వేల్స్, ఇతర జట్లకు తరఫున బరిలోకి దిగొచ్చు.

Share This Video


Download

  
Report form