రేపు మధ్యాహ్నం గం.11.30 ప్రమాణ స్వీకారం: యడ్యూరప్ప

Oneindia Telugu 2018-05-16

Views 1.9K

BS Yeddyurappa has been elected as legislative party leader. He is now heading to Raj Bhavan to stake claim to form government.
#Yeddyurappa
#Siddaramaiah
#Azad
#KarnatakaElectionResults2018

బీజేపీ శాసన సభా పక్ష నేతగా యడ్యూరప్ప ఎన్నికయ్యారు. ఆయన కాసేపట్లో రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అంతేకాదు. తాను శుక్రవారం మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో యెడ్డీని శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. రేపు ప్రమాణ స్వీకారం అనంతరం బలం నిరూపించుకోవడానికి యడ్యూరప్పకు సమయం ఇవ్వనున్నారు. ఆ సమయంలో ఆయన తన బలం నిరుపించుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్, జేడీఎస్‌లలోని అసంతృప్తులను బీజేపీ తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది.
యడ్యూరప్ప రేపు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు జేడీఎస్ శాసన శాసన సభా పక్షం భేటీ కానుంది. ఓ వైపు బెంగళూరులో హీటెక్కుతున్న సమయంలోనే మరోవైపు యెడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం గమనార్హం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS