Jayasimha Clarifies About His Attempt In Bombay

Filmibeat Telugu 2018-05-18

Views 416

Director Rajasimha issues a clarification. He is fine and will be coming to Hyderabad in couple of days
#Rajasimha
#Hyderabad

తెలుగు రచయిత, దర్శకుడు రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు గురువారం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇండస్ట్రీ పీపుల్ షాకయ్యారు. ఆయన ముంబైలోని తన గదిలో అపస్మారక స్థితిలో పడిఉండటంతో నిద్రమాత్రలు మింగినట్లు భావించారు. వెంటనే ఈ విషయాన్ని మీడియాకు చేరవేయడంతో పాటు, అపస్మారక స్థితిలో పడిఉన్న అతడి ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వార్త కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. ప్రస్తుతం కోలుకున్న జయసింహ నిన్న రాత్రి ఏం జరిగిందో వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం తాను బావున్నానని, ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు రాజసింహ తెలిపారు. నిన్న రాత్రి హెల్త్ ఇష్యూ వల్లనే అపస్మారక స్థితిలోకి వెళ్లానని, తనకు డయాబెటిక్ ఉందని, షుగర్ వ్యాల్యూస్ ఒక్కసారిగా పెరగడంతో అన్‌కాన్షియస్‌లోకి వెళ్లినట్లు తెలిపారు.
నేను అపస్మారక స్థితిలోకి వెళ్లిన సమయంలో తన పక్కన ఎవరూ లేరు. కొంతసేపటి తర్వాత నా రూముకు వచ్చిన వారు అలా పడి ఉన్న నన్ను చూసి నిద్రమాత్రలు మింగినట్లు భావించారు. ఇపుడు అంతా బావుంది, నా గురించి కంగారుపడ్డవారందరికీ థాంక్స్... అని ట్వీట్ చేశారు.
రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతాను. తాను ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? అన్ని విషాయల గురించి వెల్లడిస్తానని అని రాజసింహ తెలిపారు.

Share This Video


Download

  
Report form