Andhra Pradesh Minister for IT, Panchayat Raj and Rural Development Nara Lokesh on Friday received the "Digital Leader of the Year" award during Businessworld Digital India Summit and Awards 2018 at New Delhi.
#NaraLokesh
#DigitalLeaderoftheYear
#ChandrababuNaidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి.. సీఎం చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ ‘డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. ఓ బిజినెస్ మ్యాగజైన్ ఏటా అందజేసే అవార్డుల్లో భాగంగా ఈ ఏడాదికి గాను ‘డిజిటల్ లీడర్’ అవార్డు లోకేష్‌ను వరించింది. శుక్రవారం న్యూ ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్.. రాజస్థాన్ పరిశ్రమల శాఖ మంత్రి రాజ్‌గోపాల్ సింగ్ షెఖావత్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్న టెక్నాలజీ, డ్యాష్ బోర్డ్ ఏర్పాటు ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో అధునాతన సాంకేతికత, సాధించిన ఫలితాల ఆధారంగా లోకేష్‌కు ఈ అవార్డు దక్కింది. అలాగే రాష్ట్రంలో జలవాణి, గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం వినియోగిస్తున్న అధునాత ట్రాకింగ్ సిస్టమ్‌కు మరో అవార్డు లభించింది.