ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నాలు చేసిన బీజేపీ నాయకుల మీద విచారణ : రామలింగా రెడ్డి | Oneindia Telugu

Oneindia Telugu 2018-05-21

Views 254

Congress MLA Ramalinga Reddy said i will write letter to Kumaraswamy after he take oath as Cm to investigate MLA purchase issue of BJP leaders.

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నాలు చేసిన బీజేపీ నాయకుల మీద విచారణ జరిపించాలని మనవి చేస్తామని ఆ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. బీఎస్ యడ్యూరప్పను సీఎం చేసి కర్ణాటకను లూటీ చెయ్యాలని బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ ప్రయత్నాలు చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి ఆరోపించారు. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో సోమవారం రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల పేరుతో భారీ మొత్తంలో నగదు ఆశ చూపించి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యాలని ప్రయత్నాలు చేశారని, ఆ ఆడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయని మాజీ హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు
ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులు ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రామలింగా రెడ్డి ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎన్ని నాటకాలు అడినా విచారణలో అసలు విషయాలు వెలుగు చూస్తాయని, ఎవ్వరూ తప్పించుకోలేరని రామలింగా రెడ్డి అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS