Rashmi Gautam unhappy with NATA event managers. "who so ever concern... no one approached me for this event and May I request the management to pls check with the artist for an official acceptance letter before starting the publicity" Rashmi Gautam tweeted.
#Rashmi Gautam
#NATA
అమెరికాలో ఉండే తెలుగు సంఘాలు నిర్వహించుకునే కార్యక్రమాలకు మన సినీతారలు అతిథులుగా హాజరవ్వడం, అక్కడుంటే తెలుగు వారిని తమ ఆట పాటలతో ఎంటర్టెన్ చేయడం లాంటి ఈవెంట్లు తరచూ జరగడం చూస్తేనే ఉన్నాం. త్వరలో 'నాటా' (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా సిటీలో మరో భారీ ఈవెంట్ జరుగబోతోంది. జులై 6 నుండి జులై 8 వరకు జరిగే ఈవెంట్ కోసం ఇప్పటి నుండే ప్రచారం మొదలు పెట్టారు. ప్రభాస్, రష్మి, శ్రీను వైట్లతో పాటు చాలా మంది స్టార్స్ హాజరవుతున్నటు నిర్వాహకులు ప్రకటించారు. దీనిపై యాంకర్ రష్మి భగ్గుమన్నారు.
తన అనుమతి లేకుండా, కనీసం తనను సంప్రదించకుండా తాను ‘నాటా' ఆధ్వర్యంలో జరిగే ఈవెంటుకు తాను హాజరవుతున్నట్లు ప్రచారం చేయడంపై యాంకర్ రష్మి మండి పడ్డారు. ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తాము రాక పోయినా వస్తున్నట్లు ప్రచారం చేసి ఈవెంటుకు హాజరయ్యే వారిని తప్పతోవ పట్టించవద్దు. ఈ మధ్య కాలంలో కొన్ని ఈవెంట్ ఆర్గనైజేషన్లు తరచూ చర్యలకు పాల్పడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు అని రష్మి గౌతమ్ తెలిపారు.
తాము రాక పోయినా వస్తున్నట్లు ప్రచారం చేసి ఈవెంటుకు హాజరయ్యే వారిని తప్పతోవ పట్టించవద్దు. ఈ మధ్య కాలంలో కొన్ని ఈవెంట్ ఆర్గనైజేషన్లు తరచూ చర్యలకు పాల్పడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు అని రష్మి గౌతమ్ తెలిపారు.
ఈవెంట్ ఆర్గనైజర్లు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారంపై ‘నాటా' పెద్దలకు తెలిసేలా ఆమె ట్వీట్ చేశారు. తమ ఫోటోలు వాడే ముందు అఫీషియల్ కన్ఫర్మేషన్ లెటర్స్ తీసుకోవాలని రష్మి ఈ సందర్భంగా సూచించారు.