SriReddy sensational comments on Pawan Kalyan and his Janasena Party. Pawan fans gives counter to SriReddy
కాస్టింగ్ కౌచ్ పై పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి విషయాలజోలికి వెళ్లి పూర్తిగా వివాదంలోకి చిక్కుకుపోయింది. మొదట్లో శ్రీరెడ్డి జరిగిన అన్యాయం తెలుసుకున్నవారంతా ఆమెకు మద్దత్తు తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై చట్టపరమైన పోరాటం చేయాలనీ పలువురు సూచించినా శ్రీరెడ్డి మాత్రం ఆ విషయాన్ని పక్కన పెట్టేసి కొన్ని న్యూస్ ఛానల్స్ డిబేట్లలో పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అయిందనే విమర్శఎక్కువవడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యతిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన తల్లిని దూషించడంతో ఈ తతంగం వెనుక పెద్ద కుట్ర జరుగుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా స్పదించిన పవన్ కళ్యాణ్ సదరు మీడియా సంస్థల అధినేతలని దుమ్ము దులిపేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీరెడ్డిని ఓ పావుగా మాత్రమే వాడుకున్నారనే విషయం అందరికి అర్థం అయింది. తాజాగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన రాజకీయ విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.
శ్రీరెడ్డికి పబ్లిసిటీ కల్పించే పనిని ఆయా మీడియా సంస్థలు పూర్తిగా మానేశాయి. దీనితో శ్రీరెడ్డి వ్యాఖ్యలు కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం అంటూ మొదలు పెట్టిన శ్రీరెడ్డి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా, రాజకీయంగా టార్గెట్ చేయడం వెనుక ఎవరు ఉన్నారంటూ ఆయన అభిమానులు సంధిస్తున్న ప్రశ్న.
జనసేన పార్టీలో కనీసం కొన్ని పదవులైనా అభిమానులకు ఇచ్చి ఉండాల్సిందని శ్రీరెడ్డి అభిప్రాయ పడుతోంది. పవన్ కళ్యాణ్ బలం అభిమానులు మాత్రమే అని చెబుతోంది.
ఈ క్రమంలో జనసేన పార్టీపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీని కుల సేన పార్టీ అని ఎందుకు అంటున్నారో ఇదే నిదర్శనం అని శ్రీరెడ్డి తన పేస్ బుక్ పేజ్ లో పోస్ట్ పెట్టింది.
జనసేన పార్టీలో ఉన్న కీలక పదవులన్నీ పవన్ కళ్యాణ్ తన సామజిక వర్గం వారికే కట్టబెట్టారని ఆ పార్టీలో భాద్యతలు వహిస్తున్న వారి పేర్లు ప్రస్తావించింది. పార్టీలో ఉన్న అత్యంత కీలక పదవులనుంచి జిల్లా ఇంఛార్జుల వరకు పవన్ కళ్యాణ్ తన సామజిక వర్గంతో నింపేసారని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది
#Pawan Kalyan
#SriReddy