Challenge Accepted," PM Modi Tells Virat Kohli, With A Promise. Virat Kohli posted a video of himself doing 20 spider planks and tagged PM Narendra Modi for the fitness challenge, which was originally started by Union Minister Rajyavardhan Rathore.
కేంద్రమంత్రి నుంచి వచ్చిన సవాల్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వీకరించాడు. మళ్లీ దానిని ప్రధాని మోడీకి ఫార్వార్డ్ చేశాడు. అయితే కోహ్లీ.. విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు ప్రధాని అంగీకారం తెలిపారు. ఫిట్‌నెస్ నేపథ్యంలో జరిగిన ఈ ఛాలెంజ్‌కు ప్రధాని బదులిస్తూ.. విరాట్.. నువ్వు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నా. త్వరలోనే నా ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియోను షేర్ చేస్తానంటూ కోహ్లి ట్వీట్‌కు ప్రధాని స్పందించారు.
జిమ్‌లో 20 స్పైడర్ ప్లాంక్స్ చేసిన వీడియోను ట్వీట్ చేసిన విరాట్ కోహ్లి.. మీ ఫిట్‌నెస్ నిరూపించుకోండంటూ.. తన భార్య అనుష్క శర్మ, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రధాని నరేంద్ర మోదీలకు సవాల్ విసిరాడు.
అంతకు ముందు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రారంభించారు. మనం ఫిట్‌గా ఉంటే ఇండియా ఫిట్‌గా ఉంటుందనే హ్యాష్‌ట్యాగ్‌తో తను ఎక్సర్‌సైజ్ చేసిన వీడియోను పోస్ట్ చేసిన రాథోడ్.. హృతిక్ రోషన్, విరాట్ కోహ్లి, సైనా నెహ్వాల్‌లకు ఛాలెంజ్ విసిరాడు. ఈ సవాల్‌ను స్వీకరించిన కోహ్లి.. ప్రధానిని ట్యాగ్ చేస్తూ.. తన ఫిట్‌నెస్ ఫ్రూవ్ చేసుకున్నాడు.
సైనా నెహ్వాల్ జిమ్‌లో బరువులెత్తుతున్న వీడియోను ట్వీట్ చేసి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఛాలెంజ్‌కు బదులిచ్చింది. తనను ఇందులో భాగం చేసినందుకు మంత్రికి థ్యాంక్స్ చెప్పింది. తన వంతుగా పీవీ సింధు, రానా దగ్గుబాటి, గౌతమ్ గంభీర్‌లకు ఈ ఛాలెంజ్ విసిరింది.