Heavy rain created flood situation in coastal Karnataka. 2 people Loss their Lives due to rain. state and central government working to bring position to normal.
#heavyrain
#flood
#coastal
#karnataka
#kumaraswamy
#mangaluru
కర్ణాటకలోని కరావళి (కోస్తా ప్రాంతం)లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. కర్ణాటక కరావళి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇద్దరు మృతి చెందారు. కరావళి ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సహాయక చర్యలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది.
కర్ణాటకలోని కరావళి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. ఇల్లు కుప్పకూలడంతో మోహిని అనే మహిళ శిథిలాల్లో చిక్కుకునింది. మోహినిని రక్షించడానికి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె మరణించింది. వర్షం నీటిలో కొట్టుకుని వెళ్లి ఓ చిన్నారి మరణించింది.
మంగళూరు నగరంతో పాటు కరావళి ప్రాంతంల్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ఇళ్లు కుప్పకూలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
మంగళూరు జిల్లాతో పాటు కరావళి ప్రాంతాల్లోని జిల్లాల్లో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మంగళూరు చేరుకునే అనేక రహదారులు జలమయం అయ్యాయి. మంగళూరులో బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమాన సర్వీసులను తాత్కాలికంగా వేరే ఎయిర్ పోర్టులకు మళ్లించారు.
ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మంగళూరుతో పాటు కరావళి జిల్లాల్లోని అధికారులతో చర్చించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ డీఆర్ఎఫ్ కు చెందిన 38 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.