The BCCI has decided to reward the three national selectors with increased remuneration besides doubling the fees of umpires, scorers and video analysts.
#bcci
#salaries
#umpires
#wages
జాతీయ సెలెక్టర్లు, అంపైర్లు, రిఫరీలు, వీడియో అనలిస్టుల జీతాలు రెండింతలు పెంచేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈమేరకు సబా కరీమ్ నేతృత్వంలోని బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ, క్రికెట్ పాలక మండలి (సీఓఏ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
బోర్డు తాజా నిర్ణయం జాతీయ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ప్రస్తుత సెలక్షన్ కమిటీ వేతనాల్లో భారీ పెరుగుదల కనిపించనుంది. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌కు ఏడాదికి రూ. 80 లక్షలు, మిగిలిన సెలెక్టర్లు ఒక్కొక్కరు రూ. 60 లక్షల చొప్పున జీతం పొందుతున్నారు.
ఇకపై చీఫ్ సెలెక్టర్‌కు రూ. కోటి, మిగిలిన ఇద్దరు సెలెక్టర్లు ఒక్కొక్కరికీ రూ.75 నుంచి 80 లక్షలు రెమ్యూనరేషన్‌గా ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇకపై అంపైర్లకు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, మూడు రోజులు, వన్డేలకు రోజుకు రూ. 40వేలు లభించనున్నాయి. ప్రస్తుతం అది రూ. 20 వేలుగా ఉంది.