Rana Daggubati To Undergo Eye Surgery

Filmibeat Telugu 2018-06-02

Views 1

Rana Daggubati, who is currently busy with the shooting of Haathi Mere Saathi, will soon undergo eye surgery. Deccan Chronicle reports that he has been feeling a lot of discomfort in his right eye and the doctors have suggested surgery to avoid further damage. Rana Daggubati's father Suresh Babu confirmed the news and revealed that the surgery would take place in a foreign country which they are yet to finalise.
#RanaDaggubati
#SureshBabu

బాహుబలి తర్వాత వరుస సినిమాలు చేస్తున్న రానా దగ్గుబాటి క్లిష్టమైన కంటి సర్జరీ చేయించుకొనేందుకు విదేశాలకు వెళ్లనున్నారు. కుడి కంటిలో తలెత్తిన తీవ్ర సమస్య వల్ల ఇబ్బంది పడుతున్న రానా ఇటీవల వైద్యులను సంప్రదించగా సర్జరీ అవసరమని సూచించినట్టు సమాచారం. త్వరలోనే శస్త్ర చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లను ఓ దేశంలో చేస్తునట్టు తెలిసింది. రానాకు చిన్నప్పటి నుంచే ఓ కంటిలో చూపులేదనే విషయం తెలిసిందే.
రానా కంటి చికిత్సకు సంబంధించిన విషయాన్ని ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ ఆయన తండ్రి సురేష్‌బాబు ధ్రువీకరించారు.గతంలో మాక్స్ విజన్ వైద్యుడు సతీష్ గుప్తా పర్యవేక్షణలో ఆపరేషన్ జరిగింది. ఈ సారి విదేశంలో సర్జరీ చేయాలని ఆయన సూచించారు. ఇంకా ఏ దేశంలో అనే విషయం తేలలేదు. సరైన సమయం, తేదీ కోసం ఎదురుచూస్తున్నాం అని సురేష్‌బాబు వెల్లడించారు.
మంచు లక్ష్మీ నిర్వహించే ఓ టాక్ షోలో తనకు సంబంధించిన ఓ కంటిలో చూపులేదు. నాకు ఒకే కన్ను పనిచేస్తుంది. ఆ కన్నును కూడా ఓ దాత ఇవ్వడం ద్వారా ఆ కన్ను పనిచేస్తున్నది అని రానా చెప్పడం అభిమానులు షాక్ గురిచేసింది.

Share This Video


Download

  
Report form