Rama Prabha About Present Actors Behaviour

Filmibeat Telugu 2018-06-02

Views 60

Rama Prabha is an Indian actress who performs in Telugu language, Tamil and Hindi films. She acted in more than 1400 films.

తెలుగు సినిమా చరిత్రలో ప్రముఖ నటి రమాప్రభ గురించి ప్రస్తావిస్తే ఆమె కేరీర్ ప్రత్యేకమైన అధ్యాయంగా మారుతుంది. ఆమె నటించని పాత్ర లేదు. వేయని వేషం లేదు. ప్రతిభకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఎందరో దిగ్గజ నటీనటులతో నటించారు. తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి గొప్ప నటిగా పేరుతెచ్చుకొన్నారు. ప్రస్తుతం పరిశ్రమకు దూరమై మదనపల్లిలో శేష జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలను, కష్టాలను ప్రేక్షకులతో పంచుకొన్నారు. రమాప్రభ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..
జయలలితతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. చాలాసార్లు రమ్మని కాల్ చేశారు. కానీ మధ్యవర్తుల వల్ల సాధ్యపడలేదు. కొందరి చేష్టల వల్ల దూరమయ్యాం. శశికళ తదితరులు నన్ను ఏం కావాలి.. ఎందుకు వచ్చారు అని ప్రశ్నించినపుడు హర్ట్ అయ్యాను. అందుకే జయలలితకు దూరంగా ఉన్నాను.
చెన్నైలో నా కెరీర్‌లో ఎంతో జీవితాన్ని చూశాను. కేవలం డ్యూయెట్లు చేస్తే హీరోయిన్లా? ఇప్పటి హీరోయిన్ల కంటే ఎక్కువగా వెరైటీ రోల్స్ వేశాను. నేను వేసిన పాత్రలు కొందరు వారి జీవితంలో వేయలేదు. వేయలేరు. ఇప్పుడు ఉన్న హీరోయిన్లకు సరైన అవగాహన లేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS