YSRCP MP Avinash Reddy was arrested in Jammalamadugu on Sunday. While he is going into Devagudi village TDP leaders and police stopped them at Chintakommadinne
#kadapa
#jammalamadugu
#ysrcp
#avinashreddy
#adinarayanareddy
కడప జిల్లా జమ్మలమడుగులో మంత్రి ఆది నారాయణ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీ నేతలు గ్రామంలో అడుగుపెట్టబోతున్నారన్న విషయం తెలిసి ఆది వర్గీయులు వారి రాకను అడ్డుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు సైతం వైసీపీ నేతలకు అడ్డుచెప్పడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు సమాచారం.
మంత్రి ఆదినారాయణరెడ్డి స్వగ్రామం దేవగుడి. ఇదే గ్రామానికి చెందిన ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ సంపత్ వివాహం మే 25న జరిగింది. వివాహానికి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఇతర నాయకులను ఆహ్వానించారు. అయితే ఆ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్నందునా పెళ్లికి ఎంపీ హాజరవలేదు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆ దంపతులను కలిసేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డితో కలసి పెద్దదండ్లూరుకు బయలుదేరారు.
ఎంపీ ఆయన అనుచరులు గ్రామంలో అడుగుపెడుతున్నారని తెలియగానే మంత్రి ఆది అనుచరులు అప్రమత్తమైనట్టు సమాచారం. ఆ వెంటనే ఆది తనయుడు సుధీర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పెద్దదండ్లూరు చేరుకున్నట్టు తెలుస్తోంది. తొలుత సంపత్ ఇంటికి వెళ్లిన ఆయన.. పెళ్లి సందర్భంగా ఇంటి ముందు ఏర్పాటు చేసిన షామియానాని ధ్వంసం చేసినట్టు చెబుతున్నారు.