Amazon Prime's first Telugu web series GangStars starring Jagapathi Babu, Navdeep and Shweta Basu Prasad has garnered rave reviews from the audience.GangStars has been written by Nandini Reddy, directed by Ajay Bhuyan and jointly produced by Sillymonks Entertainment and Early Monsoon Tales, a web division of Vyjayanthi Movies.
#AmazonPrime
#GangStar
అమేజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలో వచ్చిన తొలి తెలుగు వెబ్ సిరీస్ 'గ్యాంగ్‌స్టార్స్'. దీనికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. జగపతి బాబు రౌడీ పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో నవదీప్, శ్వేతా బసు, సిద్ధు జొన్నలగడ్డ, అపూర్వ అరోరా, శివాజీ, పోసాని కృష్ణ మురళి, హరితేజ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. నందీని రెడ్డి కథ అందించగా అజయ్ భుయాన్ దర్శకత్వం వహించారు. సిల్లీమంక్స్ ఎంటర్టెన్మెంట్స్, ఎర్లీమాన్‌సూన్ టేల్స్ (వైజయంతి మూవీస్ వారి వెబ్ డివిజన్) సంయుక్తంగా నిర్మించారు. మొత్తం 12 భాగాలుగా ఈ వెబ్ సిరీస్ విడుదల చేశారు.
కుమార్ దాస్ అలియాస్ కెడి (జగపతి బాబు) రౌడీయిజం, దందాలు, సెటిల్మెంట్లు, వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఇతడు చేసే దందాలకు పోలీస్ ఆఫీసర్ (శివాజీ) సహకారం అందిస్తూ ఉంటాడు. ఓసారి కెడి స్పృహ తప్పి పడిపోవడంతో అనుచరులు ఆసుపత్రిలో చేరుస్తారు. అతడికి ఎలాంటి జబ్బు లేక పోయినా... ల్యాబ్ రిపోర్ట్స్ తారుమారు కావడంతో అది చూసిన డాక్టర్ క్యాన్సర్ చివరి దశలో ఉందని, ఆరు నెలల కంటే ఎక్కువ బ్రతకడం కష్టం అని చెప్పడంతో ఆందోళనలో పడ్డ కెడి చనిపోయేలోపు తన వద్ద ఉన్న బ్లాక్ మనీ వైట్‌గా మార్చి భార్య పిల్లల పేరు మీద డిపాజిట్ చేయాలనుకుంటాడు.
బ్లాక్ మనీ త్వరగా వైట్ చేయాలంటే సినిమా తీయడం ఒకటే మార్గమని భావించిన కుమార్ దాస్..... ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ నిర్మాతగా పేరున్న పోసాని కృష్ణ మురళిని బినామీగా పెట్టి సినిమా ప్రారంభిస్తాడు. ఈ సినిమాలో నవదీప్, శ్వేతా బసు హీరోయిన్లు. వారి మేనేజర్లుగా సిద్ధు జొన్నల గడ్డ, అపూర్వ అరోరా నటించారు.
హీరో హీరోయిన్ మధ్య గొడవలతో సినిమా షూటింగ్ ఇబ్బందుల్లో పడుతుంది. అంతా సర్దుకుని షూటింగ్ జరుగుతుంది అనుకునే సమయానికి అనుకోకుండా హీరో హీరోయిన్ చేతిలో కుమార్ దాస్ బావమరిది రెడ్ (రాహుల్ రామకృష్ణ) హత్యకు గురవుతాడు. దీంతో కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ విషయం తెలిసి కుమార్ దాస్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ కేసు చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది అనేది తర్వాతి కథ.