Around 12 Petrol tankers of goods rail were leaked near Yedeyur station of Mangaluru-Yashwantpur route on Tuesday.
#petrol
#oil
#goods
#karnataka
వేగంగా వెలుతున్న గూడ్స్ రైలులోని ట్యాంకర్లలో ఉన్న పెట్రోల్ లీక్ కావడంతో రైల్వే సిబ్బంది, పోలీసులు హడలిపోయారు. ఏకంగా గూడ్స్ రైలులోని 12 ట్యాంకర్లలో పెట్రోల్ లీక్ కావడం అందర్నీ ఆందోళనకు గురి చేసింది. మంగళూరు నుంచి బెంగళూరు నగరంలోని యశవంతపురం రైల్లే స్టేషన్ కు గూడ్స్ రైలులో 15 ట్యాంకర్లలో పెట్రోల్ తీసుకువస్తున్నారు. మార్గం మధ్యలో మంగళవారం ఉదయం తుమకూరు జిల్లా కుణిగల్ సమీపంలోని యడియూరు రైల్వే స్టేషన్ దగ్గర పెట్రోల్ లీక్ అయిన విషయం రైల్వే సిబ్బంది గుర్తించారు