Akkineni fans offers palabhishekam to RGV cutout. Officer movie became huge disaster
అక్కినేని నాగార్జున సినీ జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అందులో ఎలాంటి సందేహం లేదు. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఎప్పటికి మరచిపోలేని చిత్రం శివ.
ఈ చిత్రంతో నాగార్జున స్టార్ రేసులోకి దూసుకుని వచ్చాడు. ఆ తరువాత కూడా నాగార్జున కొన్ని మంచి చిత్రాలని వర్మ తెరకెక్కించాడు. కానీ ఈ మధ్య కాలంలో వర్మకు ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు. ఈ తరుణంలో నాగ్, వర్మ కాంబినషల్ ఆఫీసర్ చిత్రం తెరకెక్కింది. సూపర్ హిట్ కాంబినేషన్ కాబట్టి నాగార్జున అభిమానులు వర్మపై నమ్మకం ఉంచారు. కానీ ఆఫీసర్ చిత్రం అత్యంత దారుణంగా పరాజయం చెందింది. వర్మ గురించి తెలిసి కూడా నాగార్జున అతడితో సినిమా చేశారని ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు తొలి రోజే కోట్లల్లో షేర్ వసూళ్లు చేస్తాయి. కానీ ఆఫీసర్ చిత్రం ఫుల్ రన్ లో కూడా కనీసం ఒక కోటి దాటడం కష్టంగా ఉంది. అంతదారుణంగా ఈ చిత్రం పరాజయం చెందింది. ట్రేడ్ పండితులు ఈ చిత్రాన్ని టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అభివర్ణిస్తున్నారు.
గత కొన్ని చిత్రాలుగా వర్మ సంగతి పసిగట్టిన ప్రేక్షకులు నాగార్జున సినిమా అయినప్పటికీ కనీసం ఆఫీసర్ సినిమా థియేటర్స్ వైపుకూడా వెళ్ళలేదు. ఫలితంగా నాగ్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన ఓపెనింగ్స్నమోదయ్యాయి. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 47 లక్షలు మాత్రమే రాబట్టింది.