ne of India's oldest award ceremonies, the Filmfare Awards South, felicitates talent and excellence across Tamil, Telugu, Malayalam and Kannada cinema. Filmfare is back again.
సినిమా యాక్టర్లు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో 'ఫిల్మ్‌ఫేర్' అవార్డులను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడక జూన్ 16న హైదరాబాద్‌లోని నోవాటెల్ & హెచ్‌ఐసిసి కాంప్లెక్స్‌లో గ్రాండ్‌గా జరుగబోతోంది. ఈ వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఆయా భాషాల్లో ఉత్తమ సినిమాలు, నటులు, టెక్నీషియన్లకు అవార్డుల ప్రధానం జరుగనుంది. వివిధ విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాలు, యాక్టర్లు, టెక్నీషియన్ల వివరాలు ప్రకటించారు. ఈ సారి ఉత్తమ నటుడు కేటగిరీలోమెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ తో పాటు యంగ్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది.
ఉత్తమ చిత్రం నామినేషన్స్
అర్జున్ రెడ్డి
బాహుబలి 2
ఫిదా
గౌతమీపుత్ర శాతకర్ణి
ఘాజీ
శతమానం భవతి
ఉత్తమ దర్శకుడు నామినేషన్స్
క్రిష్ - గౌతమీపుత్ర శాతకర్ణి
రాజమౌళి - బాహుబలి 2
సందీప్ వంగ - అర్జున్ రెడ్డి
సంకల్ప్ రెడ్డి - ఘాజీ
సతీష్ వేగేష్న - శతమానం భవతి
శేఖర్ కమ్ముల - ఫిదా