Swara Bhasker opens on receiving criticism.
వీర్ ది వెడ్డింగ్ చిత్రం విడుదలై విజయవంతగా ప్రదర్శితమవుతోంది. నలుగురు యువతులు వారి ఆలోచన విధానాలని చూపించే చిత్రంగా విడుదలైన ఈ చిత్రం అటు విమర్శలు, ప్రశంసలు అందుకుంటోంది. కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, తలసానియా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. స్వరభాస్కర్ నటించిన ఓ సన్నివేశం పెను దుమారం రేపుతోంది. స్వరభాస్కర్ ఈ చిత్రంలో మాస్టర్ బేషన్ సన్నివేశంలో బోల్డ్ గా నటిచింది. ఈ సన్నివేశమే స్వర భాస్కర్ కు తీవ్ర విమర్శలని తెచ్చిపెడుతోంది.
సినిమాల్లో మగవాళ్ళు ఎం చేసినా చూపించవచ్చు. కానీ ఆడవాళ్లు చేస్తే మాత్రం అలా చేసింది, ఇలా చేసింది అని వివాదం సృష్టిస్తారు అని స్వర భాస్కర్ అంటోంది. ఈ సన్నివేశంలో నటించే సమయంలోనే తాను ఈ వివాదాన్ని ఊహించానని స్వర తెలిపింది .
సోషల్ మీడియాలో స్వర భాస్కర్ కు మహిళల నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఓ సంధర్భంలో స్వర భాస్కర్ మహిళా సాధికారికత గురించి మాట్లాడింది. మాస్టర్ బేషన్ చేయడం సాధికారత ఎలా అవుతుందని ఓ మహిళ సోషల్ మీడియాలో సూటిగా ప్రశ్నించింది.